2024-10-16 13:10:44.0
https://www.teluguglobal.com/h-upload/2024/10/16/1369687-rakul.webp
ప్రముఖ నటి రకుల్ ప్రీత్ సింగ్‌కు గాయం అయినట్లు తెలుస్తోంది. ఇటీవల జిమ్‌లో రకుల్ 80 కేజీల బరువును లిఫ్ట్ చేసే సమయంలో ఆమె వెన్నుముక్కకు గాయం అయినట్లు టాక్.
ప్రముఖ నటి రకుల్ ప్రీత్ సింగ్‌కు గాయం అయినట్లు తెలుస్తోంది. ఇటీవల జిమ్‌లో రకుల్ 80 కేజీల బరువును లిఫ్ట్ చేసే సమయంలో ఆమె వెన్నుముక్కకు గాయం అయినట్లు టాక్. వైద్యులు ఆమెను పరిశీలించి కొన్ని వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. ప్రస్తుతం బెడ్ రెస్ట్‌లో ఉన్న వీడియోను సోషల్ మీడియాలో వైరలవుతుంది. అయినప్పటికీ, ఆమె వరుసగా రెండు రోజులు ‘దే దే ప్యార్ దే 2’ షూటింగ్ కొనసాగించారని తెలుస్తోంది.
3 రోజులు నొప్పితో బాధపడిన తర్వాత, ఆమె ఫిజియోను కలిశారని అంటున్నారు. అయితే, ప్రతిసారీ నొప్పి 3-4 గంటల తర్వాత తిరిగి వస్తుందని అంటున్నారు. చివరకు పూర్తి బెడ్ రెస్ట్ తీసుకోవాలని డాక్టర్ సూచించారు. ఇప్పుడు ఆమె కోలుకుంటోంది. బెల్ట్ ధరించకుండా 80 కిలోల బరువును ఎత్తడానికి ప్రయత్నిస్తున్నప్పుడు వెన్నెముకలోని ఎల్4, ఎల్5 అలాగే ఎస్1 సమీపంలోని నరాలపై చాలా ఒత్తిడి పడిందని అంటున్నారు.
Rakul Preet Singh,Gym,Bed rest,De De Pyaar De 2′ movie,spine