2024-10-07 02:52:49.0
https://www.teluguglobal.com/h-upload/2024/10/07/1366827-joheny.webp
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నట్లు తెలుస్తోంది. 4 రోజుల మధ్యంతర బెయిల్ రద్దు చేయాలంటూ పోలీసులు కోర్టును ఆశ్రయించనున్నారు.
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు మరో షాక్ తగిలింది. అత్యాచార కేసు నేపథ్యంలో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు నేషనల్ అవార్డును నిలిపివేసిన విషయం తెలిసిందే. అంతకుముందు అవార్డు తీసుకునేందుకు ఆయనకు రంగారెడ్డి కోర్టు 4 రోజుల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఇప్పుడు అవార్డు నిలిపివేయడంతో జానీ బెయిల్ రద్దు చేయాలంటూ పోలీసులు కోర్టును ఆశ్రయించనున్నారు. దీంతో ఆయనను మళ్లీ కోర్టు రిమాండ్‌కు తరలించే ఛాన్స్ ఉంది.
తన అసిస్టెంట్ లేడీ కొరియోగ్రాఫర్‌ను లైంగికంగా వేధించాడనే ఆరోపణలతో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. మరోవైపు జానీ మాస్టర్‌కు ఆట సందీప్ మద్దుతు తెలిపారు. జానీ మాస్టర్ ఆయనేం తప్పుచేయలేదంటూ ఆట సందీప్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆట సందీప్, ఆయన భార్య ఓ వీడియో కూడా విడుదల చేయడం జరిగింది. జానీ మాస్టర్‌కు నేషనల్ అవార్డు రద్దవడం బాధ కలిగించిందని… మహిళ విషయం కావడంతో ఇన్నాళ్ళూ జానీ మాస్టర్ కేసుపై స్పందించలేదని ఆయన తెలిపారు.
Choreographer Johnny Master,Rangareddy Court,National Award,Interim bail