Mohan Lal | మోహన్ లాల్ కు అస్వస్థత

 

2024-08-19 04:09:36.0

https://www.teluguglobal.com/h-upload/2024/08/19/1353224-mohan-lal.webp

Mohan Lal – నటుడు మోహన్ లాల్ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

నటుడు మోహన్ లాల్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆయన్ను కేరళలోకి అమృత హాస్పిటల్ లో జాయిన్ చేశారు. ఆయన తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నారు. ప్లేట్ లెట్స్ కౌంట్ కూడా దారుణంగా పడిపోయింది. అందుకే హాస్పిటల్ లో చేర్చాల్సి వచ్చింది.

పూర్తి స్థాయిలో వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు, ఎలాంటి ప్రమాదం లేదని తేల్చారు. కేవలం అది వైరల్ జ్వరమని నిర్థారించారు. ఉన్నట్టుండి మోహన్ లాల్ అస్వస్థతకు గురవ్వడానికి ఓ కారణం ఉంది. స్వీయ దర్శకత్వంలో హీరోగా నటిస్తూ ఓ సినిమా తెరకెక్కిస్తున్నారు మోహన్ లాల్. ఆ మూవీ ఇప్పటికే 3 సార్లు వాయిదా పడింది. తాజాగా మరో రిలీజ్ డేట్ ఇచ్చారు.

ఆ తేదీకి ఎలాగైనా సినిమాను రెడీ చేయాలనే టెన్షన్ లో ఆయనకు ఆరోగ్య సమస్యలు తలెత్తినట్టు చెబుతున్నారు. వైద్యులు ఆయనకు 5 రోజులు బెడ్ రెస్ట్ సూచించారు. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన మోహన్ లాల్, ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నారు. ఆయన సినిమాలు, చేయాల్సిన పనులన్నీ 5 రోజులు వాయిదా పడ్డాయి. 

 

Mohan Lal,Hospitalized,Viral Fever