Saripodhaa Sanivaaram | నాని సినిమా ట్రయిలర్ రెడీ

 

2024-08-11 15:44:57.0

https://www.teluguglobal.com/h-upload/2024/07/13/1344051-saripodhaa-sanivaaram-nani-1.webp

Saripodhaa Sanivaaram – నాని తాజా చిత్రం సరిపోదా శనివారం. ఈ సినిమా ట్రయిలర్ రెడీ అయింది.

నాని, వివేక్ ఆత్రేయ కాంబోలో వస్తున్న రెండో సినిమా ‘సరిపోదా శనివారం’. ఈ సినిమా ప్రమోషన్స్ ఆల్రెడీ మొదలయ్యాయి. రీసెంట్ గా రిలీజైన ‘నాట్ ఏ టీజర్’ వీడియోకి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే సినిమాలోని ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ని పరిచయం చేస్తూ రిలీజ్ చేసిన పోస్టర్స్ కూడా క్లిక్ అయ్యాయి.

తాజాగా సరిపోదా శనివారం మేకర్స్ ట్రైలర్ రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు. ఆగస్ట్ 13న ‘సరిపోదా శనివారం’ ట్రైలర్ ని విడుదల చేయనున్నారు. ఈ చిత్రాన్ని డివివి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి హై బడ్జెట్‌ తో నిర్మిస్తున్నారు.

ఈ పాన్ ఇండియా యాక్షన్-అడ్వెంచరస్ మూవీకి జేక్స్ బిజోయ్ మ్యూజిక్ అందిస్తున్నాడు. కార్తీక శ్రీనివాస్ ఎడిటర్. ఆగస్ట్ 29న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రం గ్రాండ్ గా విడుదల కానుంది. సినిమాలో నాని సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటించింది. ఎస్ జే సూర్య విలన్ గా నటిస్తున్నాడు.

 

Nani,Saripodhaa Sanivaaram,Saripodhaa Sanivaaram Trailer,Priyanka Mohan