2024-08-08 17:39:31.0
https://www.teluguglobal.com/h-upload/2024/08/08/1350914-naga-chaitanya-sobhita-dhulipala.webp
Naga Chaitanya and Sobhita – నాగచైతన్య, శోభిత భార్యాభర్తలు కాబోతున్నారు. ఇద్దరూ ఈరోజు ఉంగరాలు మార్చుకున్నారు.
హీరో నాగచైతన్య, హీరోయిన్ శోభిత ధూలిపాళ్ల నిజజీవితంలో ఒకటి కాబోతున్నారు. ఈరోజు వీళ్ల నిశ్చితార్థం పూర్తయింది. దీంతో ఇన్నాళ్లు వీళ్ల రిలేషన్ షిప్ పై ఉన్న పుకార్లు నిజమని తేలాయి.
రెండేళ్లుగా నాగచైతన్య, శోభిత డేటింగ్ లో ఉన్నారు. లండన్ లో అనుకోకుండా దిగిన ఓ ఫొటోలో వీళ్లిద్దరూ తొలిసారి కనిపించారు. అప్పట్నుంచి రూమర్లు వినిపిస్తూనే ఉన్నాయి. మధ్యలో వీళ్లు ఆ పుకార్లను ఖండించినప్పటికీ, తెరవెనక ఏదో జరుగుతోందన్న అనుమానాలు మాత్రం అలానే ఉన్నాయి.
ఎట్టకేలకు ఆ అనుమానాలు తీరాయి. ఇన్నాళ్లూ ప్రేమించుకున్న చైతూ, శోభిత ఇప్పుడు పెళ్లితో ఒకటి కాబోతున్నారు. ఈరోజు వీళ్లిద్దరి ఎంగేజ్ మెంట్ పూర్తయినట్టు స్వయంగా నాగార్జున ప్రకటించారు. నాగ్ ఇంట్లోనే ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ నిశ్చితార్థం పూర్తయింది. ఫొటోలు కూడా బయటకొచ్చాయి.
నాగచైతన్యకు ఇది రెండో పెళ్లి. ఇంతకుముందు నాగచైతన్య-సమంత ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే వాళ్ల వైవాహిక బంధం ఐదేళ్లు కూడా కొనసాగలేదు. అలా సమంతకు అధికారికంగా విడాకులిచ్చిన నాగచైతన్య, ఆ తర్వాత శోభితకు దగ్గరయ్యాడు. ఇప్పుడు ఆమెనే తన జీవిత భాగస్వామిగా చేసుకోబోతున్నాడు.
Naga Chaitanya,Sobhita Dhulipala,engagement