Mechanic Rocky | మెకానిక్ రాకీ నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్

 

2024-08-07 16:42:06.0

https://www.teluguglobal.com/h-upload/2024/08/07/1350635-vishwak-mechanic.webp

Mechanic Rocky Movie Gulledu Gulledu Song: విశ్వక్ సేన్ కొత్త సినిమా మెకానిక్ రాకీ. ఈ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజైంది.

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ తన అప్ కమింగ్ మూవీ ‘మెకానిక్ రాకీ’తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమౌతున్నారు. ఈ మోస్ట్ ఎవైటెడ్ మూవీని మాస్ యాక్షన్, కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందించారు. ఈ చిత్రానికి రవితేజ ముళ్లపూడి రచన, దర్శకత్వం వహించాడు.

ప్రముఖ నిర్మాత రామ్ తాళ్లూరి తన ఎస్ఆర్టీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిర్మించారు. ఫస్ట్ లుక్, ఫస్ట్ గేర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేశారు. గుల్లేడు గుల్లేడు లిరిక్స్ తో సాగే ఈ సాంగ్ వినడానికి, చూడ్డానికి కూడా బాగుంది.

ఈ పాట ఫోక్ టచ్ తో ఆకట్టుకుంది. లిరిక్ రైటర్ సుద్దాల అశోక్ తేజ తెలంగాణ సంప్రదాయం ఉట్టిపడేలా అద్భుతమైన సాహిత్యాన్ని అందించారు. జేక్స్ బెజోయ్ సాంగ్ ని జానపదాల స్టయిల్ లో కంపోజ్ చేశాడు. ఇదొక ప్రీ వెడ్డింగ్ సాంగ్.

సింగర్ మంగ్లీ ఈ పాట పాడగా.. సాంగ్ లో విశ్వక్ సేన్, మీనాక్షి చౌదరిల కెమిస్ట్రీ ఆకట్టుకుంది. యష్ మాస్టర్ దీనికి డాన్స్ అందించాడు. శ్రద్ధా శ్రీనాథ్ మరో హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని అక్టోబర్ 31న దీపావళికి విడుదల చేయబోతున్నారు.

 

Vishwak Sen,Mechanic Rocky,Meenakshi Chaudhary,Telugu Songs