Telusu Kada | సిద్ధు జొన్నలగడ్డ సినిమాలో కదలిక

 

2024-07-20 17:20:07.0

https://www.teluguglobal.com/h-upload/2024/07/20/1345941-telusu-kada-1.webp

Telusu Kada – సిద్ధు జొన్నలగడ్డ కొత్త సినిమా ‘తెలుసు కదా’. ఈ మూవీ రెగ్యులర్ షూట్ కు డేట్ ఫిక్స్ అయింది.

టిల్లు స్క్వేర్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ తన తదుపరి ప్రాజెక్ట్ కు రెడీ అయ్యాడు. సినిమా పేరు ‘తెలుసు కదా’. నీరజ కోన దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూట్ త్వరలోనే ప్రారంభం కాబోతోంది.

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మాతగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి భారీ షెడ్యూల్ ప్లాన్ చేశారు. ఆగస్ట్ 5 నుంచి ఏకథాటిగా 30 రోజుల పాటు ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ చేయబోతున్నారు. ఈ మేరకు నెల రోజుల కాల్షీట్లు కేటాయించాడు సిద్ధు.

ఈ సుదీర్ఘమైన షెడ్యూల్‌లో టాకీ పార్ట్‌తో పాటు పాటలను కూడా చిత్రీకరిస్తారు. హైదరాబాద్‌లోనే 30 రోజుల పాటు సాగే ఈ షెడ్యూల్ కోసం భారీ సెట్స్ వేశారు. హీరోయిన్లు రాశిఖన్నా, శ్రీనిధి శెట్టి కూడా ఈ షెడ్యూల్ లో జాయిన్ అవుతారు.

ఈ సినిమా కోసం సిద్దూ జొన్నలగడ్డ స్టైలిష్‌గా మేకోవర్ అవుతున్నాడు. వైవా హర్ష కీలక పాత్రలో నటించనున్నాడు అత్యంత భారీ బడ్జెట్‌తో టిజి విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత. తమన్ సంగీతం అందిస్తున్నాడు.

 

Siddhu Jonnalagadda,Telusu Kada,shooting updates,Raashi Khanna