2024-07-05 14:41:18.0
https://www.teluguglobal.com/h-upload/2024/07/05/1341930-double-ismart-1.webp
Double Ismart – రామ్ పోతినేని తాజా చిత్రం డబుల్ ఇస్మార్ట్. తాజాగా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది.
హీరో రామ్ పోతినేని, డైరెక్టర్ పూరి జగన్నాధ్ బ్లాక్ బస్టర్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా ‘డబుల్ ఇస్మార్ట్’. ఆగస్ట్ 15న ఇండిపెండెన్స్ డే కానుకగా ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు. తాజాగా సినిమా షూటింగ్ మొత్తం పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి.
మేకర్స్ మాస్ సాంగ్ అఫ్ ది ఇయర్ ‘స్టెప్పా మార్’తో మ్యూజిక్ ప్రమోషన్స్ ప్రారంభించారు. ‘డబుల్ ఇస్మార్ట్’ ను పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కిస్తున్నారు. బ్లాక్ బస్టర్ హిట్టయిన ఇస్మార్ట్ శంకర్ కు సీక్వెల్ గా ఈ సినిమా వస్తోంది.
పూరి కనెక్ట్స్ బ్యానర్‌లో పూరి జగన్నాధ్, ఛార్మీ కౌర్ నిర్మించిన ఈ సినిమాలో సంజయ్ దత్ పవర్ ఫుల్ పాత్రలో నటించగా, రామ్ సరసన కావ్య థాపర్ హీరోయిన్ గా నటిస్తోంది. మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.
Ram Pothineni,double ismart,shooting completed,Puri Jagannadh