Saripodha Shanivaaram | పాటలతో సిద్ధమైన నాని

 

2024-06-10 17:41:51.0

https://www.teluguglobal.com/h-upload/2024/06/10/1335172-nani.webp

Saripodha Shanivaaram – నాని తాజా చిత్రం సరిపోదా శనివారం. ఈ సినిమా పాటలతో రెడీ అయింది.

నేచురల్ స్టార్ నాని తన అప్ కమింగ్ పాన్ ఇండియా ఫిల్మ్ ‘సరిపోద శనివారం’లో సూర్య పాత్రలో రఫ్ లుక్ లో కనిపించనున్నాడు. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్న ఈ అడ్వంచర్ మూవీని డివివి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

తాజాగా మూవీ టీం మ్యూజిక్ ప్రమోషన్స్ ని స్టార్ట్ చేయడానికి సిద్ధమైంది. సరిపోదా శనివారం ఫస్ట్ సింగిల్ జూన్ 15 రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. జేక్స్ బిజోయ్ ఈ సినిమా కోసం అద్భుతమైన ఆల్బమ్ కంపోజ్ చేశారు.

ఈ చిత్రంలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుండగా, ఎస్ జే సూర్య కీలక పాత్రలో కనిపించనున్నాడు. మురళి డివోపీగా పని చేస్తున్నారు. కార్తీక శ్రీనివాస్ ఎడిటర్.

ఈ పాన్ ఇండియా చిత్రం ఆగస్టు 29న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది. హాయ్ నాన్న తర్వాత నాని నుంచి వస్తున్న సినిమా ఇదే.

 

Nani,Saripodha Shanivaaram,songs Ready,Vivek Atreya