Ram Pothineni | మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రామ్

 

2024-06-05 17:20:21.0

https://www.teluguglobal.com/h-upload/2023/09/28/832114-skanda-telugu-review.webp

Ram Pothineni – డబుల్ ఇస్మార్ట్ సినిమాను కొలిక్కి తీసుకొచ్చిన రామ్ పోతినేని, ఇప్పుడు మరో మూవీ ప్రకటించే ఆలోచనలో ఉన్నాడు.

పూరీ జగన్నాధ్‌తో చేస్తున్న డబుల్ ఇస్మార్ట్ కొలిక్కి రావడంతో, కొత్త సినిమాపై కసరత్తులు మొదలుపెట్టాడు హీరో రామ్. అతను హరీష్ శంకర్‌తో చర్చలు జరుపుతున్నట్లు పుకారు ఉంది. కానీ హరీష్ బిజీగా ఉన్నాడు. మిస్టర్ బచ్చన్ తర్వాత తిరిగి పవన్ సినిమాకు షిఫ్ట్ అవ్వాలి. సో.. ఇప్పట్లో వీళ్ల కాంబో తెరపైకి రాదు.

ఈ క్రమంలో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌తో తదుపరి చిత్రం చేయడానికి రామ్ అంగీకరించాడని తెలుస్తోంది. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో దర్శకుడిగా పరిచయమైన పి.మహేష్.. రామ్ ను డైరక్ట్ చేయబోతున్నాడు.

“మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి తర్వాత తన తదుపరి చిత్రాన్ని మైత్రీతో చేయడానికి మహేష్ కమిట్ అయ్యాడు. ఇచ్చిన మాట ప్రకారం మంచి కథ రెడీ చేశాడు. ఈ కథ రామ్ కు బాగా నచ్చిందట.

తాజా సమాచారం ప్రకారం, రామ్‌తో భారీ ఎమోషనల్ డ్రామా ప్లాన్ చేశాడు మహేష్. ఈ చిత్రాన్ని సెప్టెంబర్‌ నుంచి సెట్స్ పైకి తీసుకురాబోతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై రామ్ సినిమా చేయడం ఇదే తొలిసారి.

 

Ram Pothineni,Director Mahesh,Mythri Movie Makers