Meera Jasmine | తెలుగులో మరో మూవీ

 

2024-06-02 16:50:53.0

https://www.teluguglobal.com/h-upload/2024/06/02/1333130-meera-jasmine-1.webp

Meera Jasmine – శ్వాగ్ సినిమాలో కీలక పాత్ర పోషించింది మీరా జాస్మిన్. ఆమె ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు.

శ్రీవిష్ణు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం శ్వాగ్. ఈ సినిమా నుంచి మరో ఫస్ట్ లుక్ వచ్చింది. మీరా జాస్మిన్‌ను ఉత్ఫల దేవిగా పరిచయం చేస్తూ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఆమె రాణి కావాల్సింది. కానీ కొన్ని లక్షణాల వల్ల ఆమె సింహాసనాన్ని కోల్పోయింది.

క్యారెక్టర్ ఇంట్రడక్షన్ పోస్టర్‌లో మీరా జాస్మిన్, భారీ నగలతో మహారాణిలా కనిపిస్తోంది. కానీ ఇంతకుముందే చెప్పుకున్నట్టు ఆమె మహారాణి కాదు. ఆమె క్యారెక్టర్ కు ఇది పర్ ఫెక్ట్ లుక్. కొంత బ్రేక్ తీసుకున్న మీరా జాస్మిన్ చాలా కాలం తర్వాత ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపిస్తోంది. దీనికంటే ముందు ఆమె విమానం సినిమాలో చిన్న పాత్ర చేసింది.

శ్రీవిష్ణు, హసిత్ గోలి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇంతకుముందు వీళ్ల కాంబోలో రాజరాజ చోర సినిమా వచ్చి, పెద్ద హిట్టయిన సంగతి తెలిసిందే. వివేక్ సాగర్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు.

 

Meera Jasmine,first look,Swag Movie