Faria Abdullaah | ‘ఆ ఒక్కటి అడక్కు’లో ఫరియా రోల్ ఇదే!

 

2024-04-28 08:16:29.0

https://www.teluguglobal.com/h-upload/2024/04/28/1322835-faria-1.webp

Faria Abdullaah – ఆ ఒక్కటి అడక్కు సినిమాలో తన పాత్ర తీరుతెన్నుల్ని బయటపెట్టింది హీరోయిన్ ఫరియా అబ్దుల్లా.

కామెడీ కింగ్ అల్లరి నరేష్ ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘ఆ ఒక్కటీ అడక్కు’ తో రాబోతున్నాడు. మల్లి అంకం దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని చిలక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజీవ్ చిలక నిర్మిస్తున్నారు. ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా నటిస్తోంది.

అల్లరి నరేష్ చాలా కాలం తర్వాత చేస్తున్న కామెడీ ఎంటర్ టైనర్ కావడంతో ఈ సినిమాపై ప్రత్యేక ఆసక్తి నెలకొంది. ఈ సినిమా టీజర్‌, ట్రైలర్‌ కు మంచి స్పందన వచ్చింది. మే 3న సినిమా గ్రాండ్ గా విడుదల కానున్న నేపధ్యంలో హీరోయిన్ ఫరియా అబ్దుల్లా విలేకరులతో మాట్లాడింది. సినిమాలో తన పాత్ర గురించి వెల్లడించింది.

“ఆ ఒక్కటీ అడక్కులో నా పాత్ర పేరు సిద్ధి. నా పాత్ర చాలా స్వేఛ్చగా ఉంటుంది. అన్ని ప్లాన్ చేసి, నిబంధనలు పెట్టుకొని అందులోనే బ్రతకడం తనకి ఇష్టం ఉండదు. హీరో పాత్ర నా పాత్రకు భిన్నంగా ఉంటుంది. తను అన్నీ ప్లాన్ ప్రకారం చేస్తుంటాడు. ఈ రెండు పాత్రల మధ్య మంచి కాన్ ఫ్లిక్ట్ ఉంది. అదే సమయంలో మంచి ఎట్రాక్షన్ కూడా ఉంటుంది. పెళ్లి అనే అంశం చుట్టూ కథ ఉంటూ అందరినీ ఆకట్టుకుంటుంది.”

ఇలా సినిమాలో తన పాత్ర గురించి బయటపెట్టింది ఫరియా అబ్దుల్లా. ఇన్నాళ్లకు తన ఎత్తుకు సరితూగే హీరోతో నటించానంటూ సరదాగా జోక్ చేసింది. 

 

Faria Abdullaah,Aa Okkati Adakku,Allari Naresh