2024-10-31 07:31:11.0
చాలీచాలని జీతం వచ్చే ఓ బ్యాంకు ఉద్యోగి స్టోరీ ఇది. ఫ్యామిలీ కోసం అప్పులు.. ఆ తర్వాత లక్కీ కోటీశ్వరుడు అవుతాడు
మాలీవుడ్ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా మీనాక్షి చౌదరి హీరోయిన్గా వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన మూవీ లక్కీ భాస్కర్ మూవీ తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో నేడు గ్రాండ్గా విడుదలైంది. ఇంతకు సినిమా ఎలా ఉంది? దుల్కర్ మరో హిట్టు కొట్టాడా? తెలియాలంటే రివ్యూ చూసేయండి. ముంబై నేపథ్యంలో సాగే స్టోరీ ఇది. భాస్కర్ కుమార్ (దుల్కర్ సల్మాన్) మిడల్ క్లాస్ చెందిన ఓ సాధారణ బ్యాంక్ ఉద్యోగి. తక్కువ జీతం, దానికి తోడు కుటుంబ భారమంతా ఒక్కడిపైనే. భార్య సుమతి (మీనాక్షి చౌదరి)తో పాటు, కొడుకు, తండ్రి, చెల్లి, తమ్ముడు.. ఇలా అందరి బాధ్యతలూ తనవే. బ్యాంకు సహా దొరికిన చోటంతా అప్పులు చేస్తాడు.
ఉద్యోగ ప్రమోషన్ కోసం ఎదురు చూస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తుంటాడు. ఉత్తమ ఉద్యోగి అనే పేరొస్తుంది తప్ప ప్రమోషన్ మాత్రం రాదు. దీంతో పైసాలు అవసరమై ఆంటోనీ(రాంకీ) అనే వ్యక్తితో కలిసి బ్యాంక్ డబ్బులతో చిన్న చిన్న అవినీతి చేస్తాడు. అంతా బాగానే ఉంటది. డబ్బులు బాగానే సంపాదిస్తాడు. కొన్ని కారణాల వల్ల ఇదంతా ఆపేస్తాడు. కానీ అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. ఏకంగా బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్ అవుతాడు. కోట్లకు కోట్లు సంపాదిస్తాడు. ఇంత డబ్బు ఎలా సంపాదించాడు? భాస్కర్ ని సీబీఐ వాళ్ళు ఎందుకు ఎంక్వయిరీ చేశారు? ఈ కథకి బిగ్ బుల్ హర్ష మెహ్రాకి సంబంధం ఏంటనేది మిగిలిన స్టోరీ సినిమా చూడాల్సిందే.
టైటిల్: లక్కీ భాస్కర్
నటీనటులు: దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి, సచిన్ ఖేడ్కర్, టిను ఆనంద్ తదితరులు
నిర్మాత: నాగవంశీ
డైరెక్టర్: వెంకీ అట్లూరి
మ్యూజిక్: జీవీ ప్రకాష్ కుమార్
విడుదల తేదీ: 2024 అక్టోబర్ 31
Lucky Bhaskar Movie,hero Dulquer Salmaan,Heroine Meenakshi Chaudhary,Director Venky Atluri,Producer Nagavanshi,Lucky BhaskarReview