తెలంగాణ కీర్తిపతాకం పైడి జైరాజ్‌

2024-09-28 14:52:09.0

పుస్తకావిష్కరణలో సీఎం రేవంత్‌ రెడ్డి

తెలంగాణ కీర్తిపతాకం పైడి జైరాజ్‌ అని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. జైరాజ్‌ 115వ జయంతి సందర్భంగా జర్నలిస్ట్‌ పొన్నం రవిచంద్ర రాసిన ”ద ఫస్ట్‌ యాక్షన్‌ హీరో” పుస్తకాన్ని సీఎం రేవంత్‌ సెక్రటేరియట్‌ లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, జైరాజ్‌ తెలంగాణ జాతి గర్వించదగ్గ అద్భుతమైన కళాకారుడు, దర్శకుడు, నటుడు, నిర్మాత అన్నారు. కరీంనగర్‌ నుంచి హైదరాబాద్‌ కు వచ్చి ఇక్కడి నుంచి ముంబైకి వెళ్లి బాలివుడ్‌ లో ప్రముఖ హీరోగా జాతీయ చిత్రసీమను కొన్ని దశాబ్దాల పాటు ఏలారని గుర్తు చేశారు. రచయిత రవిచంద్ర మాట్లాడుతూ, 1980లోనే జైరాజ్‌ దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు పొందారని, 130కి పైగా సినిమాల్లో హీరోగా నటించారని తెలిపారు. కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్‌, మారిడి హరికృష్ణ, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

paidi jairaj,film hero,director,bollywood,cm revanth reddy,book launch