2016-03-11 04:23:22.0
ఒక ప్రజాప్రతినిధి ఈ మాటలు అన్నాడు. ఇక ఆయనకు ఎలా చెబితే స్త్రీపురుష సమానత్వం గురించి అర్థమవుతుందో తెలియక ఆయన చుట్టూ ఉన్న మహిళలు తలలు పట్టుకుంటున్నారు. ఇరాన్ ఎంపి నాదెర్ ఘాజీపూర్ ఒక ఎన్నికల ప్రచార సభలో గతనెలలో ఇలాంటి కామెంట్ చేశాడు. పార్లమెంటులో నక్కలకూ, గాడిదలకు, మహిళలకు స్థానం లేదని ఆయన సెలవిచ్చాడు. సదరు ఎంపి తన స్పీచ్‌లో ఈ మాటలు అంటున్నప్పుడు సభకు వచ్చినవారంతా కేరింతలు కొట్టారు. గత నెలలో ఈ వీడియో […]
http://www.teluguglobal.com/wp-content/uploads/2016/03/womens-donky.gif
ఒక ప్రజాప్రతినిధి ఈ మాటలు అన్నాడు. ఇక ఆయనకు ఎలా చెబితే స్త్రీపురుష సమానత్వం గురించి అర్థమవుతుందో తెలియక ఆయన చుట్టూ ఉన్న మహిళలు తలలు పట్టుకుంటున్నారు. ఇరాన్ ఎంపి నాదెర్ ఘాజీపూర్ ఒక ఎన్నికల ప్రచార సభలో గతనెలలో ఇలాంటి కామెంట్ చేశాడు. పార్లమెంటులో నక్కలకూ, గాడిదలకు, మహిళలకు స్థానం లేదని ఆయన సెలవిచ్చాడు. సదరు ఎంపి తన స్పీచ్‌లో ఈ మాటలు అంటున్నప్పుడు సభకు వచ్చినవారంతా కేరింతలు కొట్టారు. గత నెలలో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యి మహిళలకు ఆగ్రహాన్ని కలిగించింది. ఇప్పుడు దీనిపై కోర్టులో కేసువేసేందుకు ఇరాన్ మహిళా నాయకులు సిద్ధమవుతున్నారు.