2016-04-07 02:04:10.0
కుటుంబ నియంత్రణ విషయంలో స్త్రీల బాధ్యత ఎక్కువగా ఉండటం, అవాంఛిత గర్భాన్ని నిరోధించడం విషయంలో వారికి పూర్తి స్వేచ్ఛ లేకపోవడం ఇప్పుడున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో మహిళలు సురక్షితంగా వాడదగిన తొలిదేశీయ మహిళా కండోమ్ వెల్వెట్ మార్కెట్లోకి రానున్నది. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖా మంత్రి జెపి నడ్డా దీన్నిజాతీయ కుటుంబ నియంత్రణ సదస్సులో విడుదల చేవారు. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో సహజమైన రబ్బరుని ఎక్కువ మోతాదులో వినియోగించి దీన్ని తయారుచేశారు. ఈ కండోమ్ పూర్తిగా […]
http://www.teluguglobal.com/wp-content/uploads/2016/04/Female-Condom-Velvet.gif
కుటుంబ నియంత్రణ విషయంలో స్త్రీల బాధ్యత ఎక్కువగా ఉండటం, అవాంఛిత గర్భాన్ని నిరోధించడం విషయంలో వారికి పూర్తి స్వేచ్ఛ లేకపోవడం ఇప్పుడున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో మహిళలు సురక్షితంగా వాడదగిన తొలిదేశీయ మహిళా కండోమ్ వెల్వెట్ మార్కెట్లోకి రానున్నది. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖా మంత్రి జెపి నడ్డా దీన్నిజాతీయ కుటుంబ నియంత్రణ సదస్సులో విడుదల చేవారు. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో సహజమైన రబ్బరుని ఎక్కువ మోతాదులో వినియోగించి దీన్ని తయారుచేశారు. ఈ కండోమ్ పూర్తిగా సురక్షితమైనదని, ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా రక్షణ కల్పిస్తుందని, అంతేకాక, దీంతో మహిళలకు పునరుత్పత్తి విషయంలో పూర్తి స్వేచ్ఛ లభిస్తుందని మంత్రి నడ్డా అన్నారు.
కేరళ, తిరువనంతపురంలోని హెచ్ఎల్ఎల్ పరిశోధన కేంద్రంలో ఈ కండోమ్‌ను రూపొందించారు. దాతల నుండి సేకరించిన నిధులతో దీని ఉత్పత్తులను మరింత అభివృద్ధి పరచేలా హెచ్ఎల్ఎల్ లైఫ్‌కేర్ లిమిటెడ్ కంపెనీ, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదం పొందింది. ఈ కండోమ్‌కి ప్రపంచ ఆరోగ్య సంస్థతో పాటు యూరోపియన్ యూనియన్ ( ఈయూ), దక్షిణ ఆఫ్రికా దేశాల అనుమతి కూడా లభించింది. వెల్వెట్ రాకతో మహిళల సాధికారత అంశాల్లో ఒక భాగమైన పునరుత్పత్తి విషయంలో నిర్ణయాధికారం మహిళలకే దక్కుతుందని, అలాగే వారు అనారోగ్యాల బారిన పడకుండా తప్పించుకోవచ్చనే అభిప్రాయాలు వెలువడుతున్నాయి.
Click on Image to Read:
Female Condom,Velvet