2016-05-16 03:07:10.0
మహిళలు లైంగిక అంశాలమీద ఏ చిన్న వ్యాఖ్యానం చేసినా అది చిరిగి చేటంత అవుతుంది. అలాంటిది ఒక మహిళ నేను ఫ్రీ సెక్స్‌ని ఆమోదిస్తున్నాను అనే బహిరంగ ప్రకటన చేస్తే అది ఎంత సంచలనం సృష్టిస్తుందో అర్థం చేసుకోవచ్చు. సిపిఐ (ఎమ్ఎల్) పొలిట్ బ్యూరో మెంబర్ కవితా కృష్ణన్ ఇప్పుడు అలాంటి సంచలమే సృష్టించారు. ఆమె తన తల్లితో కలిసి సోషల్ మీడియాలో ఒక పెద్ద చర్చకు తెరతీశారు. ఆచారాలు, సంప్రదాయాలు, కట్టుబాట్లు, కులమతాలు, వయసు తారతమ్యాలు […]
http://www.teluguglobal.com/wp-content/uploads/2016/05/Kavita-Krishnan-free-sex.gif
మహిళలు లైంగిక అంశాలమీద ఏ చిన్న వ్యాఖ్యానం చేసినా అది చిరిగి చేటంత అవుతుంది. అలాంటిది ఒక మహిళ నేను ఫ్రీ సెక్స్‌ని ఆమోదిస్తున్నాను అనే బహిరంగ ప్రకటన చేస్తే అది ఎంత సంచలనం సృష్టిస్తుందో అర్థం చేసుకోవచ్చు. సిపిఐ (ఎమ్ఎల్) పొలిట్ బ్యూరో మెంబర్ కవితా కృష్ణన్ ఇప్పుడు అలాంటి సంచలమే సృష్టించారు. ఆమె తన తల్లితో కలిసి సోషల్ మీడియాలో ఒక పెద్ద చర్చకు తెరతీశారు. ఆచారాలు, సంప్రదాయాలు, కట్టుబాట్లు, కులమతాలు, వయసు తారతమ్యాలు వీటన్నింటి మీద ఆధారపడి జరిగే వివాహం తరువాత జరగాల్సిన తంతుగా సెక్స్‌ని సమాజం చూస్తుంది. అయితే ఇవన్నీ సరిగ్గా ఉన్నపుడు, భార్యకు ఇష్టం లేకుండా, ఆమెపై బలప్రయోగం చేసి కాపురం చేసినా అది మన సమాజానికి ఆమోద యోగ్యంగానే కనబడుతుంది. దీన్నే కవితా కృష్ణన్ తమ అభిప్రాయాలకు ఊతంగా చేసుకున్నారు.
స్త్రీపురుషుల మధ్య సరైన అనుబంధానికి సమాజం చెబుతున్నవన్నీ అక్కర్లేదు…ఇరువురి మధ్య సమానత్వం, గౌరవం, ఏకాభిప్రాయం ఉంటేచాలు …అంటున్నారు కవితా కృష్ణన్. ఆమె సో కాల్డ్ సాంప్రదాయ వాదులు నిరసిస్తున్న ఫ్రీ సెక్స్ అనే మాటకు అర్థం చెప్పమంటున్నారు. అసలు సెక్స్ అంటేనే స్వేచ్ఛ నేపథ్యంలో జరగాల్సింది కదా…అదే లేనపుడు అది రేప్ అవుతుంది కదా… అని ఆమె వాదిస్తున్నారు. అయితే సమాజంలో అందరూ మంచి చెడుల పట్ల విచక్షణ, తెలివితేటలు, నిబద్ధత కలిగి ఉండరు కనుక కట్టుబాట్లు లేని లైంగిక కార్యకలాపాలు సమాజానికి సర్వ అనర్థాలను తెచ్చిపెడతాయనే నిజాన్ని కూడా ఇక్కడ పక్కన పెట్టలేము.
గత ఏడాది కొంతమంది జవహర్లాల్ నెహ్రూ యూనివర్శిటీ ప్రొఫెసర్లు, కొందరు యూనివర్శిటీ విద్యార్థులు భ్రష్టుపట్టి పోతున్నారని, వారు ఆల్కహాల్, ఫ్రీ సెక్స్‌కి బానిసలవుతున్నారనే తీవ్రమైన విమర్శలు చేశారు. యాంటీ నేషనల్ స్టూడెంట్స్ పేరుతో కొందరు విద్యార్థుల వివరాలను సేవరించి వాటిని ఫైల్ చేసి మీడియాకు సైతం వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఫ్రీసెక్స్ అనే పదం వివాదాస్పదంగా మారింది. సాంప్రదాయ వాదులు దాన్ని విచ్చలవిడితనంగా భావిస్తుండగా, స్వేచ్ఛావాదులు దాన్ని మానసిక స్వేచ్ఛగా పరిగణిస్తున్నారు. దీనిపై ఒక టివి కార్యక్రమంలో స్పందించిన కవితా కృష్ణన్, ఫ్రీ సెక్స్ అనే మాటని సాంప్రదాయ కుటుంబ జీవనంలో స్త్రీలపై ఉన్న అణచివేత, నిర్భంద ధోరణుల సెక్స్‌కి పూర్తి వ్యతిరేకమనే కోణంలో నిర్వచనం ఇచ్చారు. కవితా కృష్ణన్ ఈ వ్యాఖ్యలు చేశారంటూ … స్త్రీపురుష వివక్ష అంతరించాలనే ఆశయంతో, ఫెమినిజం ప్రచారం కోసం ప్రారంభించిన స్పాయిల్ట్ మోడర్న్ ఇండియన్ ఉమన్ అనే ఫేస్ బుక్ పేజిలో పోస్టు చేశారు.
కవితా కృష్ణన్ వెల్లడించిన అభిప్రాయంపై స్పందించిన ఒక నెటిజన్ మీ తల్లి కూడా ప్రీ సెక్స్ భావాలకు అనుకూలమేనా…కనుక్కోండి అంటూ పోస్ట్ చేయగా కవితాకృష్ణన్ …అవును, నా తల్లే కాదు, మీ తల్లి కూడా అలాంటి బంధంలోనే ఉండి ఉంటారు…లేకపోతే అది రేప్ అవుతుంది అంటూ సమాధానం ఇచ్చారు. దీనిపై కవితా కృష్ణన్ తల్లి లక్ష్మీకృష్ణన్ స్పందిస్తూ, అవును నేను ఫ్రీ సెక్స్‌నే పొందాను…అంటూ సమాధానం ఇచ్చి మరో ప్రశ్నకు అవకాశం లేకుండా చేశారు.
Click on Image to Read:
Kavita Krishnan