2016-06-30 07:39:44.0
స్త్రీలు అనుభవిస్తున్న కష్టాల పట్ల తోటి స్త్రీల స్పందనలో మార్పు రావాల్సి ఉందని రాజస్థాన్లో జరిగిన ఈ ఉదంతం చెబుతోంది. భర్త సోదరుల చేత అత్యాచారానికి గురయి, నానా హింసలు పడ్డ ఒక మహిళ తన బాధలు చెప్పుకోవడానికి రాష్ట్ర మహిళా కమిషన్ కార్యాలయానికి వచ్చింది. అక్కడ కమిషన్ సభ్యురాలిగా ఉన్న సౌమ్య గుర్జార్, మహిళా బాధితురాలితో కలిసి నవ్వుతూ సెల్ఫీ తీసుకుంది. బాధితురాలిని పరామర్శిస్తున్న మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ సుమన్ శర్మ కూడా ఆ […]
స్త్రీలు అనుభవిస్తున్న కష్టాల పట్ల తోటి స్త్రీల స్పందనలో మార్పు రావాల్సి ఉందని రాజస్థాన్లో జరిగిన ఈ ఉదంతం చెబుతోంది. భర్త సోదరుల చేత అత్యాచారానికి గురయి, నానా హింసలు పడ్డ ఒక మహిళ తన బాధలు చెప్పుకోవడానికి రాష్ట్ర మహిళా కమిషన్ కార్యాలయానికి వచ్చింది. అక్కడ కమిషన్ సభ్యురాలిగా ఉన్న సౌమ్య గుర్జార్, మహిళా బాధితురాలితో కలిసి నవ్వుతూ సెల్ఫీ తీసుకుంది. బాధితురాలిని పరామర్శిస్తున్న మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ సుమన్ శర్మ కూడా ఆ పక్కనే ఉంది. గుర్జార్ తన ఐపాడ్తో మహిళా బాధితురాలితో కలిసి సెల్ఫీ తీసుకుంటున్నట్టుగా కనబడుతున్న రెండు ఫొటోలు … సోషల్ మీడియాలోకి వచ్చి తీవ్రమైన విమర్శలకు గురయ్యాయి.
సుమన్ శర్మ సైతం సెల్ఫీకి అనుకూలంగా చూస్తున్నట్టుగా ఫొటోలో కనబడుతుండగా, తనకు సెల్ఫీ తీసుకుంటున్న సంగతి తెలియదని, తాము ఉన్న ఫొటోలను బయటకు పంపిన వ్యక్తికి రేప్ బాధితురాలి మీద అసలు ఏమాత్రం గౌరవం లేదని ఆమె పేర్కొంది. సెల్ఫీ తీసిన సభ్యురాలిని వివరణ కోరినట్టుగా సుమన్ శర్మ తెలిపింది.