2016-10-26 13:02:20.0
జోడీ స్టీల్ అనే 22 ఏళ్ల అమ్మాయి రూపొందించిన వీడియో…నెటిజన్లకు విపరీతంగా నచ్చేసింది. ఇది ఎవరికైనా నచ్చుతుంది. ఇందులో ఉన్న కాన్సెప్టుతో సంబంధం లేకుండా దాన్ని వెల్లడించిన తీరు, అందులోని సృజన అందరినీ అలరిస్తుంది. అందరికీ తెలిసిన ఒక పాత విషయాన్ని సరికొత్తగా చెప్పింది ఆర్టిస్ట్ జోడీ స్టీల్. నడుము సన్నగా ఉండి ఛాతీ, నడుము కింది భాగం పుష్టిగా ఉండే అవర్‌గ్లాస్ ఫిగర్ అనేది అమ్మాయిలకు ఒక కల. ఈ బాడీ ఇమేజ్ మాయలో పడి […]
http://www.teluguglobal.com/wp-content/uploads/2016/03/women-1.gif
జోడీ స్టీల్ అనే 22 ఏళ్ల అమ్మాయి రూపొందించిన వీడియో…నెటిజన్లకు విపరీతంగా నచ్చేసింది. ఇది ఎవరికైనా నచ్చుతుంది. ఇందులో ఉన్న కాన్సెప్టుతో సంబంధం లేకుండా దాన్ని వెల్లడించిన తీరు, అందులోని సృజన అందరినీ అలరిస్తుంది. అందరికీ తెలిసిన ఒక పాత విషయాన్ని సరికొత్తగా చెప్పింది ఆర్టిస్ట్ జోడీ స్టీల్. నడుము సన్నగా ఉండి ఛాతీ, నడుము కింది భాగం పుష్టిగా ఉండే అవర్‌గ్లాస్ ఫిగర్ అనేది అమ్మాయిలకు ఒక కల. ఈ బాడీ ఇమేజ్ మాయలో పడి కొట్టుకుపోతున్న వారు కోట్లలోనే ఉంటారు. ఆ కోట్లమంది ఆకాంక్షని, ఆవేదనని, నిస్సహాయతని కొన్ని గీతల్లో అత్యంత సృజనాత్మకంగా వెల్లడించింది జోడీ స్టీల్. పొట్టని తాడుతో బిగించి కట్టేసిన అనుభూతి కలిగేలా పెయింట్ వేసుకుందామె.
వంద పదాల్లో చెప్పలేని విషయాన్ని ఒక రేఖ చెబుతుంది. చిత్రకళ గొప్పదనం అది. జోడీ స్టీల్ పొట్టమీది గీతలు కూడా బాడీ ఇమేజ్ అనే మాయ, ఆధునిక యువతరాన్ని ఒక మత్తుమందులా పట్టిపీడిస్తున్నదన్న నిజాన్ని ఎంతో ప్రభావవంతంగా చెబుతున్నాయి. ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసిన 24 గంటల్లోనే దాదాపు నాలుగుకోట్ల వ్యూస్ సంపాదించిన ఈ వీడియో ఇప్పుడు ఏనిమిది కోట్ల వ్యూస్‌కి చేరింది. మీరూ చూడండి…తప్పకుండా నచ్చుతుంది.
Body Image by Jody Steel – A Timelapse DrawingMusic by KylaidoSong title: Ebb + Flo. Available on itunes!
Posted by Jody Steel on Tuesday, March 8, 2016
Click on Image to Read:
Body Image,Jody Steel,Timelapse Drawing