https://www.teluguglobal.com/h-upload/2025/01/31/1399110-parunika-sisodia.webp
2025-01-31 08:02:06.0
8 వికెట్ల నష్టానికి 113 రన్స్ చేసిన ఇంగ్లండ్
కౌలాలంపూర్ వేదికగా జరుగుతున్న మహిళల అండర్-19 ప్రపంచకప్ సెమీస్‌లో ఇంగ్లండ్‌తో భారత్ తలపడుతున్నది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌ను.. భారత అమ్మాయిలు 8 వికెట్ల నష్టానికి 113 రన్స్‌కు కట్టడి చేశారు. పరునికా సిసోడియా, వైష్ణవీ శర్మ విజృంభించి మూడేసి వికెట్లు తీయగా.. ఆయూషీ శుక్లా రెండు వికెట్లు పడగొట్టింది. ఇంగ్లండ్ బ్యాటర్లలో ఓపెనర్ పెర్రిన్ 45, కెప్టెన్ నోర్గోవ్ 30 రన్స్ చేశారు. వరుస విజయాలతో కొనసాగుతున్న భారత్ సెమీస్‌లోనూ గెలువాలనే కృత నిశ్చయంతో ఉన్నది.ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఫైనల్‌లో మరో సెమీస్ విజేత సౌతాఫ్రికాను ఢీ కొట్టనున్నది.