ఆస్పత్రిలో వినోద్‌ కాంబ్లీ స్టెప్పులు

https://www.teluguglobal.com/h-upload/2024/12/31/1390466-vinod-kambli.webp

2024-12-31 07:59:11.0

‘చక్‌ దే ఇండియా’ పాటకు హుషారుగా స్టెప్పులేసిన మాజీ క్రికెటర్‌

 

టీమిండియా మాజీ క్రికెటర్‌ వినోద్‌ కాంబ్లీ ఇటీవల తీవ్ర అస్వస్థతతో ఆస్పత్రిలో చేరిన విషయం విదితమే. మూత్ర ఇన్‌ఫెక్షన్‌, ఇతర సమస్యలతో ఠాణే ఆస్పత్రిలో చేరాడు. వైద్య పరీక్షలు నిర్వహించగా అతని మెదడులో రక్తం గడ్డ కట్టినట్లు డాక్టర్లు గుర్తించారు. ప్రస్తుతం కాంబ్లీ కోలుకుంటున్నాడు. తాజాగా అతను ఆస్పత్రి సిబ్బందితో కలిసి పాటలు పాడుతూ డ్యాన్స్‌ చేశాడు. ‘చక్‌ దే ఇండియా’ పాటకు హుషారుగా స్టెప్పులేశాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. మరోవైపు, కాంబ్లీ ఆరోగ్య పరిస్థితి మెరగవుతున్నదని డాక్టర్లు సోమవారం తెలిపారు.