https://www.teluguglobal.com/h-upload/2024/10/10/1367936-rafel-nadal.webp
2024-10-10 10:52:06.0
టెన్నిస్ దిగ్గజం రఫెల్ నాదల్ టెన్నిస్ ఆటకు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ ఏడాది నవంబర్‌లో జరిగే డేవిస్ కప్ ఫైనల్స్ తన చివరి మ్యాచ్ అని తెలిపారు.
స్పెయిన్ స్టార్ టెన్నిస్ దిగ్గజ ప్లేయర్ రఫెల్ నాదల్ టెన్నిస్ ఆటకు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ ఏడాది నవంబర్‌లో జరిగే డేవిస్ కప్ ఫైనల్స్ తన ఆఖరి మ్యాచ్ అని తెలిపారు. 1986 జున్ 3న పుట్టిన నాదల్ 2001లో అంతర్జాతీయ టెన్నిస్‌లోకి ప్రవేశించారు. 2008లో నవంబర్‌వన్ ర్యాంకును సొంతం చేసుకున్నాడు.
ఇప్పటి వరుకు 22 గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు గెలుపొందిన ఆయన గాయాలతో వేగలేక ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. గత కొన్ని సంవత్సరాలు చాలా కష్టంగా గడిచాయి. మరీ ముఖ్యంగా గత రెండు ఏండ్లు ఎన్నో బాధలు పడ్డాను. ఎంతో ఇష్టమైన ఆటకు వీడ్కోలు పలకడం ఎంతో కష్టమైన నిర్ణయం. అందుకు నాకు ఎంతో సమయం పట్టింది. అయితే.. జీవితంలో ప్రతిదానికి ఆరంభం ఉన్నట్టే ముగింపు కూడా ఉంటుంది’ అని నాదల్ తన వీడ్కోలు ప్రకటనలో తెలిపాడు.