https://www.teluguglobal.com/h-upload/2024/10/06/1366609-india-vs-pak.webp
2024-10-06 05:27:20.0
ఈ మ్యాచ్ లో గెలిస్తేనే సెమీస్ పై ఆశలు
టీ 20 ఉమెన్ వరల్డ్ కప్ లో చిరకాల ప్రత్యర్థుల మధ్య నేడు హై టెన్షన్ మ్యాచ్ జరగనుంది. లీగ్ దశలో మొదటి టీ 20లో న్యూజిలాండ్ చేతిలో ఘోర పరాజయం పాలైన భారత జట్టు ఈ మ్యాచ్లో పాకిస్థాన్ పై విజయం సాధిస్తేనే సెమీస్ ఆశలు సజీవంగా ఉండనున్నాయి. మధ్యాహ్నం 3.30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. చిరకాల ప్రత్యర్థుల మధ్య మ్యాచ్ వీక్షించేందుకు 12 వేల మంది క్రికెట్ అభిమానులు టికెట్లు కొనుగోలు చేశారు. భారత్ తొలిమ్యాచ్ లో ఓడిపోవడంతో ఏ చిక్కులు లేకుండా సెమీస్ కు చేరాలంటే పాక్ తో పాటు ఆ తర్వాత ఆడబోయే మరో రెండు మ్యాచ్ ల్లోనూ గెలిచి తీరాలి. భారత్ తన తర్వాతి మ్యాచ్ లను శ్రీలంక, ఆస్ట్రేలియా తో ఆడనుంది.