ఐదు రన్స్‌ కే రోహిత్‌ శర్మ ఔట్‌

https://www.teluguglobal.com/h-upload/2024/09/20/1361179-rohith-sharma.webp

2024-09-20 10:40:27.0

రెండో ఇన్నింగ్స్‌ లో రెండు వికెట్లు కోల్పోయిన టీమిండియా

 

బంగ్లాదేశ్‌ తో జరుగుతోన్న రెండో టెస్ట్‌ రెండో ఇన్నింగ్స్‌ లోనూ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఆట తీరులో మార్పు రాలేదు. ఫస్ట్‌ ఇన్నింగ్స్‌ లో ఆరు పరుగులు చేసి ఔట్‌ అయిన రోహిత్‌ రెండో ఇన్నింగ్స్‌ లో ఐదు పరుగులే చేసి ఔటయ్యారు. ఫస్ట్‌ ఇన్నింగ్స్‌ లో బంగ్లాదేశ్‌ ను 149 పరుగులకే ఆల్‌ ఔట్‌ చేసిన భారత్‌.. బంగ్లా జట్టుకు ఫాలో ఆన్‌ ఇవ్వకుండా రెండో ఇన్నింగ్స్‌ ను మొదలు పెట్టింది. యశస్వి జైస్వాల్‌ తో కలిసి ఇన్నింగ్స్‌ ఆరంభించిన కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఏడు బంతుల్లో ఒక ఫోర్‌ తో ఐదు పరుగులు చేసి టస్కిన్‌ అహ్మద్‌ బౌలింగ్‌ లో జకీర్‌ హసన్‌ కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యారు. నిలకడగా ఆడుతున్నట్టు అనిపించిన జైస్వాల్‌ 17 బంతుల్లో రెండు బౌండరీలతో పది పరుగులు చేసి నహీద్‌ రాణా బౌలింగ్‌ లో లిటన్‌ దాస్‌ కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. శుభ్‌ మన్‌ గిల్‌ పది పరుగులతో, విరాట్‌ కోహ్లీ నాలుగు పరుగులతో బ్యాటింగ్‌ చేస్తున్నారు. ఇప్పటి వరకు బంగ్లాదేశ్‌ పై టీమిండియా 260 పరుగుల ఆదిక్యంలో ఉంది.