2023-08-03 08:17:19.0
https://www.teluguglobal.com/h-upload/2023/08/03/804307-sridhar-kavitha.webp
వసారా లోని తీగొకటి
కన్నీటి రెక్కలను విచ్చుకుంటుంది
ఇంటి వెతలు వింటూ…
అడివి తావి
సుడులు తిరిగిన బాధతో
తనకలాడుతోంది.
లక్ష్యాలు తన దిశను మార్చుకున్నాయి అందించాల్సిన చెయ్యి
పిండుకుంటుంది.
భరోసా ఇవ్వాల్సిన చేతులు
బురదని కెలుకుతున్నాయి.
అడివి పువ్వు ఎరుపుదనం
నగరాలలో లేదేమని
అందరి విస్మయం.
మసక చీపురుతో దులిపేసాక కూడా
బారులు కట్టిన చీమల్లా
లోనికి దారి కట్టే ఆలోచనల కేళి
వెలుతురు తాగిన వాక్యము ఒకటి
పదాలను సరి చేసుకుంటుంది
అణిచివేతను అణుచుటకు…..
కళ్ళల్లో ఎర్ర జీర
కలంలో సిరాగా మారగా…
పల్లమెరిగిన నీరు
దిశ మార్చి క్రమక్రమంగా మరులు తోంది
వెలుగు నిండిన ఎగువ దారి వైపు….
– శ్రీధర్ బాబు అవ్వారు
Sridhar Babu Avvaru,Telugu Kavithalu,Veluthuru Thagina Vakyam