తీయని బంధం

2023-07-27 15:26:07.0

https://www.teluguglobal.com/h-upload/2023/07/27/801301-thiyandi-bandam.webp

మనిషి మనిషి మధ్యన

ఏదో తెలియని బంధం

అల్లుకుని ప్రవహిస్తే

దొరుకుతుంది అంతు తెలియని

అనుభూతి

కులంతో సంబంధం లేదు

మతంతో ముడి ఉండదు

ఎక్కడ ఉంటున్నావన్నది అసలు

అక్కర్లేదు

గుడిసా, బంగ్లానా, దేశమా, విదేశమా

ఏదైనా కానీ ఎక్కడైనా కానీ

మానసిక అనుబంధం ఒక్కటి చాలు

వరుసలతో పని లేనే లేదు

సంబంధం పేరు ఏదైనా

విడివడని ప్రేమ ఒక్కటి చాలు

నీలో నాలో అందరిలో అదే చేరితే

ఇక లేనిది ఏముంది?

నువ్వే ఆలోచించు

ఏ కష్టం ఎవరికి వచ్చినా

పంచుకునే వాళ్లేందరో

ఏమంటావు?

తీయని కట్టివేతకు సిద్ధమేనా?

-యలమర్తి అనూరాధ

(హైద్రాబాద్)

Yalamarthi Anuradha,Telugu Kavithalu