2023-05-05 07:43:14.0
https://www.teluguglobal.com/h-upload/2023/05/05/757824-women.webp
దేహశుద్ధి ఆయుర్ వృద్ధి
ఈ లౌకిక లోకంలో
యిదే ప్రామాణికం
దేహశుద్ధి ఆరోగ్య కాంక్ష
ఆడాళ్ళకే ఎక్కువ
చేగోళ్ళ నుండి కాలిగోళ్ళు వరకు
ప్రతి భాగంపై పెత్తనం.
సౌందర్య పోషకాలు
వేలాది కోట్ల వ్యాపారం
ఆడాళ్ళ అందమే ఆధారం.
ఆలోచించి అభినందించాలి
వారంలో మూడు రోజులు
షాంపుస్నానం
పేలకో రోజు ప్రత్యేకం.
అసూయ పడనంటే
ఓ మాట
ఆయుష్షు లో ఆడాళ్ళేఫస్ట్.
పేస్టుల జీవితం లాస్ట్
టేస్ట్ లేని జీవితం నెక్స్ట్
అయినా మనుమలు
ముని మనుమలతో
నందనాన్ని అందుకోగలరు నారీమణులు.
రాజకీయాల్లో రమణులు
కళాసేవలో కళాకారులు
విశ్వసుందరులు
అక్షర సరస్వతులు
వ్యూహాల బృహస్పతులు
పసలేని ప్రపంచంలో
నవరస నాయికలు
జీవికలు ఆడవాళ్ళే
ఆడాళ్లూ మీకు జోహార్లు
– కపిల లక్ష్మణ కవి
Aadavallu Meeku Johaarlu,Kapila Lakshmana Kavi,Telugu Kavithalu