కలము- కత్తి

2023-05-03 09:21:11.0

https://www.teluguglobal.com/h-upload/2023/05/03/738288-kalamu-kathi.webp

కలము సమాజాన్ని

మేలుకొలపగలదు..

నిద్రపుచ్చనూ కలదు.

నిద్రాణమైఉన్న యువతలో చిగురాశలను కల్పించగలదు.

ప్రేమనూ, విరహాన్నీ

తెలుపగలదు.

ఊహల్లో ఊయలూపగలదు.

హృదయంతరాలలో

ప్రేమను తట్టి లేప గలదు.

సంసార సాగరాన్ని ఈదటానికి భయపడుతున్న జంటకు

ధైర్యం ఇవ్వగలదు.

పరిపాలకులకు,

పాలన విషయంలో

సలహాలు ఇవ్వగలదు.

అవసరం అయితే,

వీపు తట్టనూ కలదు.

వీపు మోగించనూ కలదు.

అలాంటి పదునున్న

కలాన్ని వదిలి

మెడలు కోసుకునే, తొడలు కోసే

కత్తి మనకెందుకు మిత్రమా!

– జి. మల్లికార్జున శర్మ

Kalamu Kathi,G Mallikarjuna Sharma,Telugu Kavithalu