2023-03-06 11:26:43.0
https://www.teluguglobal.com/h-upload/2023/03/06/725820-saubhagyavati.webp
ఉన్నతముగనిల్వు నుర్విలోనయువిద
యెన్నిజన్మలైన యెదురులేదు
జన్మజన్మ లోన జగతిలోన వెలుగు
రాచమార్గమాయె ! రమణిఫథము !
పేగుబంధమైన ప్రేమబంధమునిచ్చు
చెల్లిఅక్కచెలియ చెలువ అమ్మ
అంబరమున సగము అర్థనారీశ్వరా
మెలతముదితమగువ !నెలత మహిళ !
అవనిలోనతాను అబలగాజనియించి
అమ్మతనముపంచు కమ్మగాను
విప్పిచెప్పబోతె విశ్వమెఆమెలో
జననివిలువదెల్పు ! జగము నందు !
సదనమందునడిచె సుగుణాలరూపిణి
తరుణిలేనియెడల దరుణిలేదు
లక్ష్మీవున్నవీధి లక్షణమై యుండును
వీరనారిమణులు ! విశ్వమందు !
౼ బోయ వెంకటేశం
(గోటిగార్ పల్లి ,సంగారెడ్డి జిల్లా)
Boya Venkatesham,Telugu Kavithalu