అగ్నిహోత్రాత్మనే అంగుష్టాభ్యాం నమ:

2022-12-30 03:38:59.0

https://www.teluguglobal.com/h-upload/2022/12/30/433205-fingerprint.webp

సంతకం బదులు ఫింగర్ ప్రింట్ టెక్నాలజీ వాడాలని కేంద్రప్రభుత్వం 2016 లో నిర్ణయించినప్పుడు వ్రాసిన కవిత

ప్రేమకు “వేలా”యెరా ..

ఏక Love Yeah…

అన్నిట్లో వేలు పెట్టకు

అనేది ఇక పై పాత సామెత…

ఇంక అందరూ ‘వేలా’యుధన్ లే..

అంగుఠా చాప్ అని ఇంక

ఎవర్నీ గేలి చెయ్యలేరు

ఎందుకంటే

సకలవిద్యా పారంగతులు

కూడా చెరగని “వేలి” ముద్ర

వేస్తేనే చెల్లుబాటు

చెదరని సంతకం పెడితే నగుబాటు

నిజానికి సుత్తి వేలు గారుంటే తెగ సంతోషించే వారు…

Thums Up ఇంక జాతీయ బ్రాండు…

వేలు పెట్టు డబ్బు కట్టు. – ప్రిన్స్ ఆఫ్ వేల్స్ …

అందుకే …

అగ్నిహోత్రాత్మనే అంగుష్టాభ్యాం నమ:

భీం కి శక్తీ ధూం మచాయే

సామ్నే కోయీ టిక్నా పాయే

ఛోటా భీం … ఛోటా భీం …

– సాయి శేఖర్

fingerprint technology,Telugu Kavithalu,Sai Sekhar