రెండేళ్ల విశ్వాoధకారం

2022-11-28 07:37:10.0

https://www.teluguglobal.com/h-upload/2022/11/28/428393-suman.webp

‘హూ’అంటే ఎవరనుకుంటున్నారూ !

ఆసియా నిండా

చీకటి నింపింది అదే!

ఏ మందు ఎందుకిస్తారో తెలీదు

ఈ విశ్వాoధకారంలో

ఎవడెందుకు మరణించాడో తెలీదు

ప్రకటనలతో డబ్బులు దండుకునే వార్తా ప్రపంచం మాత్రం

మరణాల లెక్కల్ని పక్కాగా

ప్రకటించి మాత్రం భయపెడుతోంది

‘హూ’అంటే చాలు

ఉలిక్కి పడుతున్నారు జనం

భయంకర విహ్వల జ్వాలలతో హుంకరిస్తూ

కాళ్లలో నిస్సత్తువ నింపుతూ

ముక్కునిండా మూతినిండా

గుడ్డల్ని అడ్డేస్తూ

వ్యక్తినీ వ్యక్తినీ విడదీస్తూ

వికృత నృత్యం చేస్తోంది

ప్రాణభయాన్ని

గాలి నిండా నింపుతూ

అహంకరిస్తోంది

*

కళ్ళు తెరిస్తే చీకటి

కళ్ళు మూస్తే చీకటి

విశ్వమంతటా

అంధకారం తాండవిస్తోంది

అనంతవిశ్వమంతా

బందిఖానాలో వొదిగిపోతోంది

మాములుగా ప్రతిసంవత్సరం దర్శనమిచ్చే

జలుబుదగ్గుల ప్రేతాత్మల్ని

మూలమూలలకు తీసుకువెళ్లి పెద్దపెద్ద గద్దెలపై ప్రతిష్టించి

గత రెండేళ్ళు గా సమాజాన్నంతనీ

ఒంటరితనపు గాడిలోకి నెట్టేశారు

తుఛ్చధనార్జన కోసమే విశ్వాన్నంతటినీ

బలవంతపు ఒంటరితనంలోకి

పరుగెత్తించేసారు .

అతి క్రూర మైన రాక్షస ఆనందాన్ని పొందుతున్నది ‘హూ ‘!

ఇదంతా తన గొప్పతనమేనని సింహంలా హూంకరిస్తోంది

“బయటికి రాకు

మరొకడితో మాటలాడకు

నా మందులు నా వాక్సీన్లు మాత్రమే వేసుకుని ప్రాణాలు కాపాడుకో

అంధకారంలోనే

నీ ఆనందాన్ని వెతుక్కో !”

భ్రమావరణం లోంచి ప్రపంచం నెమ్మది నెమ్మదిగా కళ్లు తెరుస్తోంది

ఇక ప్రశాంతంగా వొళ్ళు విరుస్తోంది!

 – సుమనశ్రీ

Telugu Kathalu,Telugu Kavithalu,Telugu Poets