https://www.teluguglobal.com/h-upload/2025/01/28/1398180-ktr-revanth.webp
2025-01-28 04:03:14.0
నార్సింగ్ ఠాణాలో ఫిర్యాదు చేయనున్న బీఆర్‌ఎస్ నేతలు
ఫార్ములా -ఈ రేస్ కేసులో రేవంత్ రెడ్డిని ముద్దాయిగా చేర్చి విచారించాలని కోరుతూ బీఆర్‌ఎస్ పోలీసులకు ఫిర్యాదు చేయనుంది. పార్టీ జనరల్ సెక్రటరీ డాక్టర్ ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకుల బృందం ఉదయం 10.30 గంటలకు తెలంగాణ భవన్ నుంచి బయల్దేరి నార్సింగ్ పోలీస్ స్టేషన్ కు చేరుకుంటుంది. అక్కడి ఎస్‌హెచ్‌వోకు సీఎం రేవంత్ రెడ్డిపై నాయకులు ఫిర్యాదు చేయనున్నారు. ఫార్ములా -ఈ కార్ రేస్‌లో విదేశీ సంస్థకు నిధులు మళ్లించి రాష్ట్ర ఖజానాకు నష్టం చేశారని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై కేసు నమోదు చేశారు. ఆయనతో పాటు ఎంఏయూడీ మాజీ స్పెషల్ సీఎస్ అర్వింద్ కుమార్, హెచ్‌ఎండీఏ సీఈ బీఎల్‌ఎన్ రెడ్డిపైనా ఏసీబీ కేసు నమోదు చేసింది. ఏసీబీ నమోదు చేసిన కేసు ఆధారంగా ఈడీ విచారణ జరుపుతోంది. ఫార్ములా -ఈ కార్ రేస్ ను రేవంత్ రెడ్డి ఏకపక్షంగా రద్దు చేయడంతో తెలంగాణకు రావాల్సిన పెట్టుబడులు వెనక్కిపోయాయని, రాష్ట్రం ప్రతిష్ట దెబ్బతిన్నదని ఫిర్యాదులో పేర్కొననున్నారు. ఈ కేసులో రేవంత్ రెడ్డిని ముద్దాయిగా చేర్చి ఆయనను విచారించాలని బీఆర్‌ఎస్ నాయకులు కోరనున్నారు.
Formula -E Race,Revanth Reddy,BRS Complaint,Narsingi Police Station,KTR,MAUD,HMDA,Congress vs BRS