ఆరాంఘర్‌ ఫ్లైఓవర్‌పై ప్రమాదం.. ముగ్గురు మృతి

https://www.teluguglobal.com/h-upload/2025/01/28/1398178-aramghar-flyover.webp

2025-01-28 03:52:05.0

మితిమీరిన వేగం, ట్రిపుల్ రైడింగే ప్రమాదానికి కారణం

రాజేంద్రనగర్‌ మండలం శివరాంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఆరాంఘర్‌ ఫ్లైఓవర్‌పై ఓ ద్విచక్రవాహనం డివైడర్‌ను ఢీకొన్నది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడిక్కడే మృతి చెందగా.. చికిత్స పొందుతూ మరొకరు మృతి చెందారు. 

మంగళవారం తెల్లవారుజామున బహదూర్ పురాకు చెందిన అహ్మద్, మాజ్ ఖాద్రి, తలాబ్ కట్టకు చెందిన సయీద్ అనే ముగ్గురు  ఆరాంఘర్ ఫ్లై  ఓవర్పై బహదూర్ పురా నుంచి ఆరాంఘర్ వైపు  ఒకే స్కూటర్ పై వెళ్తున్నారు. స్టంట్లు చేస్తూ మితిమీరిన వేగంతో దూసుకెళ్తున్నారు.  ఈ క్రమంలోనే శివరాంపల్లి దగ్గరికి రాగానే అదుపు తప్పి ఫ్లై ఓవర్ పై ఎలక్ట్రిక్ పోల్ ను ఢీకొట్టింది. అనంతరం అది డివైడర్ వైపు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడిక్కడే మృతి చెందగా.. చికిత్స పొందుతూ మరొకరు మృతి చెందారు.మృతులను బహదూర్‌పురాకు చెందిన మైనర్లుగా గుర్తించారు. మితిమీరిన వేగం, ట్రిపుల్ రైడింగే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది.

Accident,On Aramgarh flyover,Three dead,Bahadurpura miners