https://www.teluguglobal.com/h-upload/2025/01/08/1392526-aravind-kumar.webp
2025-01-08 05:34:47.0
మరోవైపు ఇదే కేసులో ఈడీ విచారణకు హాజరైన బీఎల్ఎన్ రెడ్డి
ఫార్ములా ఈ-రేస్ కేసులో ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్ ఏసీబీ విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో ఆయన ఏ2గా ఉన్నారు. నిధుల బదలాయింపులో ఆయన కీలకంగా వ్యవహరించినట్లు ఆరోపణలున్నాయి. తన పరిధిలో ఉన్న హెచ్ఎండీఏ నుంచి ఎఫ్ఈవో (ఫార్ములా-ఈ ఆపరేషన్స్)కు హెచ్ఎండీఏ చీఫ్ ఎగ్జిక్యూటివ్ బీఎల్ఎన్ రెడ్డి ద్వారా నిధులు బదిలీ చేసినట్లు తెలుస్తోంది.అప్పటి మున్సిపల్ మంత్రి కేటీఆర్ ఆదేశాలతోనే నిధులు బదిలీ చేసినట్లు గతంలో అర్వింద్ కుమార్ ప్రభుత్వానికి వివరణ ఇచ్చారు. ఆయన వాంగ్మూలాన్ని ఏసీబీ అధికారులు నేడు రికార్డు చేయనున్నారు.
ఈడీ ముందుకు బీఎల్ఎన్ రెడ్డి
మరోవైపు ఫార్ములా- రేసు కేసులో బీఎల్ఎన్ రెడ్డి ఈడీ విచారణకు హాజరయ్యారు. రేస్ జరిగినప్పుడు ఆయన చీఫ్ ఇంజినీర్‌గా ఉన్నారు. రూ. 45.71 కోట్లు విదేశీ సంస్థకు బదిలీ చేసిన వ్యవహారంలో ఈడీ దర్యాప్తు చేస్తున్నది. ఏసీబీ కేసు ఆధారంగా ఈడీ మనీలాండరింగ్ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేసింది.
IAS Officer Arvind Kumar,Attended,In Front Of ACB,Formula e-Car Race,KTR