నేడు కిమ్స్‌ హాస్పిటల్‌కు అల్లు అర్జున్‌

https://www.teluguglobal.com/h-upload/2025/01/07/1392171-allu-arjun.webp

2025-01-07 02:26:26.0

బాలుడు శ్రీతేజ్‌ను పరామర్శించనున్న బన్నీ

సినీ నటుడు అల్లు అర్జున్‌ నేడు సికింద్రాబాద్‌ కిమ్స్ ఆస్పత్రికి వెళ్లనున్నారు. ఉదయం 9.30 గంటలకు ఆయన వెళ్తారని సంబంధిత వర్గాలు తెలిపాయి. సంధ్య థియేటర్‌ తొక్కిసలాట ఘటనలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్‌ను అల్లు అర్జున్‌ పరామర్శించనున్నారు. కిమ్స్‌కు వెళ్లేటప్పుడు సమాచారం ఇవ్వాలని ఇప్పటికే రాంగగోపాల్‌పేట్‌ పోలీసులు ఆయనకు నోటీసులు ఇచ్చిన విషయం విదితమే. 

Allu Arjun,Visits Sritej,To KIMS Hospital,Sandhya Theatre stamped