https://www.teluguglobal.com/h-upload/2024/11/30/1382171-accident.webp
2024-11-30 05:24:49.0
విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లి గ్రామంలో జరిగిన ఘటన
విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లి గ్రామంలో రోడ్డు ప్రమాదం జరిగింది. శ్రీకాకుళం నుంచి విశాఖపట్నంవైపు వెళ్తున్న కారు అదుపు తప్పి అవతలి రోడ్డువైపు దూసుకెళ్లి బోల్తాపడింది. అటుగా వస్తున్న లారీ ఢీ కొట్టడంతో కారులో ఉన్న నలుగురు అక్కడిక్కడే మృతి చెందారు. ఈ ఘటనలో లారీ డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు, అధికారులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
Lorry and car collided,Four members died,Polipalli village,Bhogapuram mandal,Vizianagaram district