https://www.teluguglobal.com/h-upload/2024/11/27/1381229-rgv.webp
2024-11-27 02:52:10.0
కేసులకు తానేమీ భయపడటం లేదన్న వివాదాస్పద డైరెక్టర్
ఏపీ పోలీసుల గాలింపు నేపథ్యంలో వివాదాస్పద డైరెక్టర్ రాంగోపాల్ వర్మ (ఆర్జీవీ) స్పందించారు. ఈ మేరకు ఓ వీడియోను విడుదల చేశారు. కేసులకు తానేమీ భయపడటం లేదన్నారు. తాను పోస్టులు పెట్టివారికి కాకుండా సంబంధం లేనివారి మనోభావాలు దెబ్బతింటే ఈ కేసులు, సెక్షన్‌లు ఎలా వర్తిస్తాయని ప్రశ్నించారు.ప్రస్తుతం ఓ మూవీ షూటింగ్‌లో ఉన్నానని.. నిర్మాతలకు నష్టం వస్తుందనే విచారణకు రాలేకపోతున్నట్లు తెలిపారు.
సార్వత్రిక ఎన్నికల ముందు ‘వ్యూహం’ సినిమా ప్రమోషన్ సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ వ్యక్తిత్వాలను కించపరిచేలా సోషల్ మీడియా వేదికగా ఆర్జీవీ పోస్టులు పెట్టారంటూ ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం టీడీపీ ప్రధాన కార్యదర్శి రామలింగయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాని ఆధారంగా పోలీసులు వర్మపై కేసు నమోదు చేసిన విషయం విదితమే. విచారణకు హాజరుకాకపోవడంతో అరెస్టు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. హైదరాబాద్‌లోని ఆయన నివాసం వద్దకు ఇటీవల వెళ్లారు. ఈ నేపథ్యంలోనే వర్మ వీడియో రిలీజ్ చేశారు.
Ram Gopal Varma,Controversy comments,On Chandrababu,Pawan Kalyan,Case register against RGV