లగచర్లలో కలెక్టర్‌ పై దాడి.. డీఎస్పీపై బదిలీ వేటు

https://www.teluguglobal.com/h-upload/2024/11/18/1378882-lagacharla-incident.webp

2024-11-18 13:17:36.0

పరిగి డీఎస్పీని డీజీపీ ఆఫీస్‌ కు అటాచ్‌ చేస్తూ ఉత్తర్వులు

కొడంగల్ నియోజకవర్గంలోని లగచర్లలో కలెక్టర్‌, అధికారులపై దాడి ఘటనలో ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పరిగి డీఎస్పీ వైఫల్యంతోనే కలెక్టర్‌, అధికారులపై దాడి జరిగిందని గుర్తించిన ప్రభుత్వం డీఎస్పీ కరుణసాగర్‌ పై బదిలీ వేటు వేసింది. డీజీపీ ఆఫీస్‌ కు అటాచ్‌ చేస్తూ సోమవారం ఉత్తర్వులు ఇచ్చింది. పరిగి డీఎస్పీగా శ్రీనివాస్‌ ను నియమించింది. ఫార్మా పరిశ్రమల ఏర్పాటుకు కలెక్టర్‌, అధికారులు ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లగా సరైన భద్రత కల్పించకపోవడంతో గ్రామస్తులు దాడి చేశారు. ఈ దాడికి బాధ్యుడిగా పేర్కొంటూ కొడంగల్‌ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌ రెడ్డి సహా 17 మందిని పోలీసులు ఇప్పటికే అరెస్ట్‌ చేశారు.

Lagacharla,Kodangal,CM Revanth Reddy,Pharma Industry,Attack on Officers,DSP Transfer