https://www.teluguglobal.com/h-upload/2024/11/07/1375707-ed-raids-on-amazon-flipcart.webp
2024-11-07 12:47:34.0
ఢిల్లీ, బెంగళూరు, ముంబయి, హైదరాబాద్, పంచకులలోని 19 ప్రాంతాల్లో సోదాలు
ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్ ఫామ్స్ అమేజాన్, ఫ్లిప్ కార్ట్ మెయిన్ వెండర్లపై ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు చేస్తోంది. గురువారం ఏకకాలంలో ఢిల్లీ, బెంగళూరు, ముంబయి, హైదరాబాద్ తో పాటు హర్యానాలోని పంచకులలోని 19 ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తోంది. ఎఫ్డీఐ నిబంధనలు ఉల్లంఘించి ఈ రెండు ప్లాట్ ఫామ్ ల ప్రధాన వెండర్లు అక్రమాలకు పాల్పడుతున్నారని, మార్కెట్ లో సేల్స్ ప్రైస్ ను ప్రభావితం చేస్తూ పన్నుల ఎగవేతకు పాల్పడుతున్నారని ఫిర్యాదులు అందాయి. ఈ ఫిర్యాదుల నేపథ్యంలో ఈడీ సోదాలు నిర్వహించి అనేక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుంది. పలు ఎలక్ట్రానిక్ డివైజ్ లను సీజ్ చేసినట్టు తెలిసింది. దాడులకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Amazon,Flipkart,ED,FEMA Raids,19 Places