https://www.teluguglobal.com/h-upload/2024/11/05/1374914-salmankhan.webp
2024-11-05 07:16:57.0
ఐదు కోట్లు ఇవ్వాలి లేదా బిష్ణోయ్ మందిరంలో క్షమాపణలు చెప్పాలని మెసేజ్
బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్‌కు గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ మనుషుల పేరుతో మరోసారి బెదిరింపులు వచ్చాయి. సల్మాన్ ప్రాణాలతో ఉండాలంటే ఆయన రూ. 5 కోట్లు చెల్లించాలని లేదంటే బిష్ణోయ్ మందిరంలో క్షమాపణలు చెప్పాలని ముంబయి ట్రాఫిక్ కంట్రోల్ రూమ్‌కు ఎస్‌ఎంఎస్ వచ్చింది. ఆ మెసేజ్ పంపిన వ్యక్తి తనకు తాను బిష్ణోయ్ సోదరుడిగా పేర్కొన్నారు. తమ గ్యాంగ్ ఇంకా క్రియాశీలకంగానే ఉన్నదని, తమ మాట వినకుంటే సల్మాన్‌ను చంపేస్తామని బెదిరించారు.
ఇటీవల ఝార్ఖండ్‌కు చెందిన ఓ కూరగాయల వ్యాపారి ఇదే తరహాలో రూ. 5 కోట్లు డిమాండ్ చేయగా పోలీసులు అతడిని అరెస్టు చేశారు. ఓ గుర్తు తెలియని వ్యక్తి కూడా రూ. 2 కోట్లు డిమాండ్ చేస్తూ సల్మాన్‌కు బెదిరింపులు పంపాడు. పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు.
Salman Khan,Gets Another Threat,Lawrence Bishnoi,Pay ₹ 5 Crore,Apologise