https://www.teluguglobal.com/h-upload/2024/10/29/1373482-kasaragod-kerala.webp
2024-10-29 06:13:51.0
150 మందికి పైగా గాయాలు.. 10 పరిస్థితి తీవ్ర విషమం
కేరళలోని కాసర్గోడ్లో విషాదం చోటు చేసుకున్నది. రూ. 30 వేల విలువైన బాణసంచా పేలడంతో 150 మందికి పైగా గాయాలయ్యాయి. ఇందులో 10 పరిస్థితి తీవ్ర విషమంగా ఉన్నది. అంజోతంబలం వీరేర్కావు ప్రాంతంలో తెయ్యం పండుగ ప్రారంభ వేడుకల్లో ఈ ప్రమాదం జరిగింది. ఉత్తర మలబార్ ప్రాంతంలోని ఆ వేడుకలకు ప్రజలు భారీ సంఖ్యలో తరలివెళ్లారు. ఈ క్రమంలో అక్కడి నిర్వాకులు నిల్వ ఉంచిన బాణసంచాపై నిప్పురవ్వలు ఎగిసిపడి ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా భారీ శబ్దాలతో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. దీంతో భయభ్రాంతులకు గురైన ప్రజలు తలో దిక్కున పరుగులు తీశారు. ఆ సమయంలోనే నిప్పురవ్వలు కొందరిపై పడి గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
150 Injured,In Kerala,Cracker Tragedy,Ball Of Fire