ఆటో డ్రైవర్‌ అత్యాచారం చేశాడని యువతి ఫిర్యాదు

https://www.teluguglobal.com/h-upload/2024/10/15/1369005-sexual-assault.webp

2024-10-15 05:45:38.0

ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు..నిందితుడి కోసం గాలింపు

తనపై ఆటో డ్రైవర్‌ అత్యాచారం చేశాడని గచ్చిబౌలి పోలీస్‌ స్టేషన్‌లో ఓ యువతి ఫిర్యాదు చేసింది. సోమవారం అర్ధరాత్రి ఆర్‌సీ పురం వద్ద తాను ఆటో ఎక్కినట్లు ఆమె పేర్కొన్నది. అర్ధరాత్రి 2.30 గంటల సమయంలో మసీద్‌ బండ ప్రాంతానికి ఆటో చేరుకోగానే తనపై అత్యాచారం చేశాడని ఫిర్యాదులో తెలిపింది. అనంతరం ఆటో డ్రైవర్‌ పారిపోయినట్లు వెల్లడించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడి కోసం గాలిస్తున్నారు. 

Young woman,Complains,Sexual assault,On auto driver