https://www.teluguglobal.com/h-upload/2024/10/11/1368105-pak.webp
2024-10-11 04:54:45.0
బలూచిస్థాన్‌లోని ప్రావిన్స్‌లో చోటు చేసుకున్న ఈ దారుణ ఘటన
పాకిస్థాన్‌లోని ఓ బొగ్గు గనిలో దారుణం చోటుచేసుకున్నది. ఓ సాయుధుడు బొగ్గు గనిలోని 20 మంది ఉద్యోగులను కాల్చి చంపడం కలకలం సృష్టించింది. బలూచిస్థాన్‌లోని ప్రావిన్స్‌లో ఈ ఘటన చోటుచేసుకున్నది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బలూచిస్తాన్ ప్రావిన్స్‌లోని డుకి జిల్లాలోని బొగ్గు గనిలోని గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత వసతిగృహాల్లోకి సాయుధులు చొరబడినారు. గనిలోని ఉద్యోగులను చుట్టుముట్టి వారి కాల్పులు జరిపారు. ఈ కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 20 మంది మృతి చెందగా.. ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మరణించిన వారిలో ఎక్కువమంది బలూచిస్థాన్ పష్తున్ ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు. మృతుల్లో ముగ్గురు, గాయపడిన వారిలో నలుగురు ఆఫ్ఘనిస్తాన్‌కు చెందిన వారని తెలిసింది.
ఇటీవల పాకిస్థాన్‌లోని అతిపెద్ద విమానాశ్రయంలో బైట ఆత్మహుతి దాడులు జరిగిన సంగతి తెలిసిందే. వచ్చే వారం ఇస్లామాబాద్ షాంగై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ శిఖరాగ్ర సమావేశం నిర్వహించనున్నది. ఈ నేపథ్యంలో వరుస ఘటనలు చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తున్నది.
Gunmen,kill 20 miners,injure 7,Pakistan’,Balochistan