తెలుగు హీరోయిన్లను ఎంకరేజ్ చేయకూడదు.. నిర్శాత షాకింగ్ కామెంట్స్

2025-02-17 12:58:51.0

తెలుగు హీరోయిన్లను ఉద్దేశించి నిర్మాత ఎస్కేఎన్ (శ్రీనివాస కుమార్ నాయుడు) చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.

తెలుగు హీరోయిన్లను ఉద్దేశించి నిర్శాత ఎస్కేఎన్ (శ్రీనివాస కుమార్ నాయుడు) చేసిన కామెంట్స్ కాంట్రవర్సీగా మారాయి. తాము తెలుగు రాని హీరోయిన్ లను అభిమానిస్తామని కానీ తెలుగు వచ్చిన ఎంకరేజ్ చేయబోమని సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగు వచ్చిన అమ్మాయిలను ప్రోత్సహిస్తే ఏమవుతుందో ఈమధ్యనే తమకు అర్థమయిందని ఆయన అన్నారు. ఇక నుంచి తెలుగు అమ్మాయిలను ప్రోత్సహించకూడదని తాను, డైరెక్టర్ సాయిరాజేశ్ నిర్ణయించుకున్నామని చెప్పారు. ‘రిటర్న్ ఆఫ్ డ్రాగన్’ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ కు ఎస్కేఎన్ గెస్ట్ గా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పై కామెంట్స్ చేశారు. హీరోయిన్ వైష్ణవి చైతన్య గురించే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారని చెప్పుకుంటున్నారు.

వైష్ణవిని ‘బేబీ’ సినిమాతో హీరోయిన్ గా ఎస్కేఎన్ పరిచయం చేశారు. తొలి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకున్న వైష్ణవి… ప్రస్తుతం సిద్దు జొన్నలగడ్డ, ఆనంద్ దేవరకొండల సినిమాల్లో నటిస్తోంది. తమ బ్యానర్ లో ఆమెకు ఎస్కేఎన్ మరో సినిమాను ఆఫర్ చేస్తే… ఆమె అంగీకరించలేదట. ఈ నేపథ్యంలోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారనే టాక్ నడుస్తోంది. మరోవైపు నిర్మాత ఎస్కేఎన్ పై రేఖా భోజ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రతి వాడు ఉద్దరించేసినట్లు ఎదవ బిల్డప్పులు. ఒక రకంగా ఇది తెలుగు అమ్మాయిలపై అఫీషియల్‌గా బ్యాన్ విధించినట్టే. మా బ్రతుకుదెరువుపై కొట్టేలా మాట్లాడాక మీకు గౌరవం ఇచ్చేదేంటి? అని మండిపడ్డారు. రేఖా భోజ్ మాంగళ్యం, దామిని విల్లా, రంగీలా వంటి సినిమాల్లో నటించింది.

Nirshata SKN,Srinivasa Kumar Naidu,Director Sairajesh,’Return of Dragon’ movie,heroine Vaishnavi Chaitanya,Baby’ movie,Siddu jonnalagadda,Anand Deverakonda,Rekha Bhoj,Tolley wood,Chiranjeevi