అనిల్‌ రావిపూడితో సినిమా అప్‌డేట్‌ ఇచ్చిన మెగాస్టార్‌

2025-02-09 18:19:28.0

ఈ మూవీ సెట్స్‌లో అడుగుపెట్టడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నానన్న చిరంజీవి

విశ్వక్‌సేన్‌ హీరోగా డైరెక్టర్‌ రామ్‌ నారాయణ్‌ తెరకెక్కించిన మూవీ ‘లైలా’. ఆకాంక్ష శర్మ హీరోయిన్‌. ఈ నెల 14న ఈ సినిమా రిలీజ్‌ కానున్నది.ఈ సందర్భంగా మెగాస్టార్‌ చిరంజీవి ముఖ్యఅతిథిగా చిత్రబృందం హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించింది. డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి స్పెషల్‌ గెస్ట్‌గా హాజరయ్యారు.

ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. తన కొత్త సినిమా కబురు వినిపించారు. అనిల్‌ రావిపూడి డైరెక్షన్‌లో చిరంజీవి నటించనున్నట్లు వార్తలు వినిపించిన విషయం విదితమే. ఇదే విషయాన్ని ఆయన అధికారికంగా ప్రకటిస్తూ.. ఆ సినిమా సమ్మర్‌లో ప్రారంభమౌతుందని తెలిపారు. పూర్తిస్థాయి వినోదాత్మక చిత్రమని చెప్పారు. ఈ మూవీ సెట్స్‌లో అడుగుపెట్టడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని అన్నారు. ఆయా సన్నివేశాల గురించి అనిల్‌ చెబుతుంటే కడుపుబ్బా నవ్వానని పేర్కొన్నారు. దర్శకుడు కోదండ రామిరెడ్డితో పనిచేసిన సమయంలో ఎలాంటి ఫీలింగ్‌ ఉన్నదో.. ఇప్పుడు అనిల్‌తో అలాంటి ఫీలింగే ఉందన్నారు. సాహు గారపాటి, సుస్మిత (చిరంజీవి కుమార్తె) సంయుక్తకంగా ఈ మూవీ నిర్మిస్తారని తెలిపారు. 

Megastar Chiranjeevi,Gave movie update,Anil Ravipudi,Chiru Cambo,Vishwaksen Laila,Akanksha Sharma