అహ్మదాబాద్‌ వన్‌డే లో శుభ్‌మన్‌ గిల్‌ సెంచరీ

2025-02-12 10:27:49.0

శ్రేయస్‌ హాఫ్‌ సెంచరీ.. 33 ఓవర్లలో రెండు వికెట్లకు 222 పరుగులు చేసిన టీమిండియా

అహ్మదాబాద్‌ వన్‌డేలో ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ సెంచరీ చేశాడు. 98 బంతుల్లో 14 ఫోర్లు మూడు సిక్సర్లతో 111 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. చాంపియన్స్‌ ట్రోఫీకి ముందు కింగ్‌ కోహ్లీ సైతం టచ్‌లోకి వచ్చాడు. హాఫ్‌ సెంచరీని భారీ స్కోర్‌ గా మలచడంలో మాత్రం విఫలమయ్యాడు. ఇంగ్లండ్‌తో మూడు వన్‌డేల సిరీస్‌ను ఇప్పటికే భారత్‌ 2-0 తేడాతో గెలుచుకుంది. అహ్మదాబాద్‌ వేదికగా జరుగుతోన్న మూడో వన్‌డేలో టాప్‌ గెలిచిన ఇంగ్లండ్‌ జట్టు ఫీల్డింగ్‌ ఎంచుకుంది. రెండో వన్‌డే సెంచరీ హీరో, కెప్టెన్‌ రోహిత్‌ శర్మను ఒక పరుగుకే మార్క్‌ వుడ్‌ బోల్తా కొట్టించాడు. ఫస్ట్‌ డౌన్‌ లో వచ్చిన విరాట్‌ కోహ్లీ నిలకడగా బ్యాటింగ్‌ చేశాడు. శుభ్‌మన్‌ గిల్‌ తో కలిసి రెండో వికెట్‌ కు సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పాడు. 55 బంతుల్లో 7 ఫోర్లు, సిక్సర్‌ తో 52 పరుగులు చేసిన కోహ్లీ రషీద్‌ బౌలింగ్‌లో కీపర్‌ సల్ట్‌ కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. సెకండ్‌ డౌన్‌లో వచ్చిన శ్రేయస్‌ అయ్యర్‌ ధాటిగా బ్యాటింగ్‌ కొనసాగించాడు. 43 బంతుల్లో ఆరు ఫోర్లు, సిక్స్‌ తో 50 పరుగులు చేసి క్రీజ్‌లో ఉన్నాడు. భారత జట్టు 33 ఓవర్లలో రెండు వికెట్లు నష్టపోయి 221 పరుగులు చేసింది. ఇంగ్లండ్‌ బౌలర్లలో ఆదిల్‌ రషీద్‌, మార్క్‌ వుడ్‌ చెరో వికెట్‌ పడగొట్టారు.

Ahmedabad ODI,India vs England,Shubaman Gill,Made Century,Shreyas Iyyer,Virat Kohli