రోహిత్‌ సూపర్‌ సెంచరీ.. టీమిండియా ఘన విజయం

2025-02-09 17:33:46.0

మూడు వన్డేల సిరీస్‌ను భారత్‌ ఒక మ్యాచ్‌ మిగిలి ఉండగానే 2-0తో కైవసం

ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో వన్డేలో టీమిండియా ఘన విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను భారత్‌ ఒక మ్యాచ్‌ మిగిలి ఉండగానే 2-0తో కైవసం చేసుకున్నది. మొదట బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లాండ్‌ 49.5 ఓవర్లలో 304 రన్స్‌కు ఆలౌటైంది. ఈ భారీ లక్ష్యాన్ని టీమిండియా 44.3 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. రోహిత్‌ శర్మ (119 ) చాలా కాలం తర్వాత సెంచరీతో ఫామ్‌లోకి వచ్చాడు. అతనికి వన్డేల్లో ఇది 32వ శతకం. ఈ మ్యాచ్‌లో రోహిత్‌ శర్మ తన మార్క్‌ బ్యాటింగ్‌ ప్రదర్శించాడు. 119 రన్స్‌ను 90 బాల్స్‌లోనే బాదేశాడు. ఇందులో 12 ఫోర్లు, 7 సిక్సర్లు ఉన్నాయి. ఇక భారీ అంచనాలతో బరిలోకి దిగిన విరాట్‌ కోహ్లీ (5) మళ్లీ నిరాశపరిచాడు. శుభమన్‌ గిల్‌ (60) వరుసగా రెండో హాఫ్‌ సెంచరీ చేశాడు. శ్రేయస్ అయ్యర్‌ (44) అక్షర్‌ పటేల్‌ (41 నాటౌట్‌) రాణించారు. కేఎల్‌ రాహుల్‌ (10), హార్దిక్‌ పాండ్య (10), రవీంద్ర జడేజా (11 నాటౌట్‌) రన్స్‌ చేశారు. ఇంగ్లాండ్‌ బౌలర్లలో జెమీ ఒవర్టన్‌ 2, ఆదిల్‌ రషీద్‌, లివింగ్‌స్టన్‌, అట్కిన్సన్‌ చెరో వికెట్‌ పడగొట్టారు.సిరీస్‌లో నామమాత్రపు మూడో వన్డే బుధవారం (ఫిబ్రవరి 12) అహ్మదాబాద్‌లో జరగనున్నది. 

India vs England,2nd ODI at Cuttack,IND vs ENG,Rohit Sharma,India won by 4 wickets