శ్రీవారి ఆలయ పరకామణి లెక్కింపులో అవకతవకలు

2025-03-11 04:59:16.0

టీటీడీ ఉద్యోగి కృష్ణకుమార్‌ చేతివాటం.. ఆయనపై వేటు వేసిన ఆలయ ఈవో

చెన్నైలో టీటీడీకి చెందిన శ్రీవారి ఆలయ పరకామణి లెక్కింపులో అవకతవకలు జరిగాయి. శ్రీవారికి భక్తులు సమర్పించిన హుండీ కానుకల్లో టీటీడీ ఉద్యోగి కృష్ణకుమార్‌ చేతివాటం ప్రదర్శించారు. విదేశీ కరెన్సీని ఆయన దారి మళ్లించారు. ఆ కరెన్సీ లెక్కింపులో తేడా ఉన్నట్లు గుర్తించిన టీటీడీ విజిలెన్స్‌ విభాగం.. సీనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న కృష్ణకుమార్‌ అవకతవకలకు పాల్పడినట్లు నిర్ధారించింది. ఈ మేరకు టీటీడీ ఈవో శ్యామలరావుకు నివేదిక సమర్పించింది. దాని ఆధారంగా కృష్ణకుమార్‌ను ఈవో సస్పెండ్‌ చేశారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులు జారీ అయ్యాయి. 

Srivari temple,Irregularities in the calculation,Parakamani,TTD employee Krishnakumar,Suspension