2025-02-26 17:11:21.0
హైదరాబాద్ లో అరెస్టు.. ఓబులవారిపల్లె పీఎస్ కు తరలింపు
సినీ నటుడు పోసాని కృష్ణమురళిని ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. రాయదుర్గంలోని ఆయన నివాసంలో బుధవారం రాత్రి అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసుల్లో రాయచోటి పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. కులాల మధ్య విధ్వేషాలు సృష్టించేలా పోసాని వ్యాఖ్యలు చేశారని ఆయనపై అభియోగాలు నమోదు చేశారు. పోసానిని ఆంధ్రప్రదేశ్ కు తరలిస్తున్నారు. గురువారం ఉదయం ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్ కు తరలించి అక్కడి నుంచి రాజంపేట కోర్టుకు తీసుకెళ్తారు.
Posani Krishna Murali,Arrest,AP Police,Obulavari Palle Police Station