ఎకరం వరకు భూమి ఉన్న రైతుల ఖాతాల్లో రైతుభరోసా

2025-02-05 16:35:16.0

17.03 లక్షల మందికి రూ.1,126.54 కోట్లు

ఎకరం వరకు సాగు చేస్తున్న భూములకు ప్రభుత్వం బుధవారం రైతుభరోసా సాయం అందజేసింది. ఇటీవల మండలానికి ఒక గ్రామానికి రైతుభరోసా సాయం విడుదల చేసిన ప్రభుత్వం ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 17.03 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.1,126.54 కోట్లు జమ చేశామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌ రావు ఒక ప్రకటనలో తెలిపారు.

Rythu Barosa,17.03 Lakh Farmers,Rs.1126.54 Crores,Congress,BRS,Revanth Reddy,KCR